జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం కి సంబంధించిన డిస్టిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్యశాఖ, న్యాయశాఖ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.