నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు కల్పించేలా విద్యాశాఖ, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జీ. వో నంబర్ 117 తో గతంలో 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలపడం జరిగిందని, బేసిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. 3 కి.మీ లోపల హైస్కూల్ లేని చోట తగు ఏర్పాట్లు చేసి, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.