ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మూడు నెలలుగా నరేష్‌తో పరిచయం ఉన్న తన్మయి, ఇటీవల అతడిపై పెళ్లి ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ నరేష్‌కు ఇప్పటికే వివాహం కావడంతో, ఆమెను రెండో పెళ్లి కోసం ఒత్తిడి చేయడం అతనికి ఇష్టం లేదని వివరించారు. జూన్ 3న బైకుపై తీసుకెళ్లి రహస్య ప్రదేశంలో రాయితో హత్య చేశాడని పోలీసులు వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వనౌన్ సీఐని సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.