రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన డీఎస్సీ -2025 పరీక్షల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో మొత్తం 23, 488 మంది అభ్యర్థుల్లో 22, 826 మంది హాజరయ్యారు. హాజరు శాతం 97. 18గా నమోదైంది. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.