అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీశ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ముడుపుల గురించి గురువారం బహిరంగ లేఖ రాశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈ కుంభకోణంలో కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. న్యాయస్థానాలు కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.