అనంతపురం జేఎన్టీయూలో శనివారం నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవానికి హాజరైన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ కార్యక్రమంలో పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే సింధూర భర్త పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.