రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పడుతున్న అవస్థలు కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనంతపురం మేయర్ వసీం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తన చాంబర్ లో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేయాలనే కుట్రలో భాగంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.