అనంతపురంలోని మొదటి రోడ్డు శివాలయంలో జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను శుక్రవారం ఆహ్వానించారు. ఆలయ ఈవో రమేశ్, ప్రధాన అర్చకుడు, భక్తులు నరేంద్ర చౌదరి, దాడి శ్రీనివాస్ చౌదరిలతో పాటు పలువురు భక్తులు ఎమ్మెల్యేకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈవో తెలిపారు.