అనంతపురం నగరం శివారు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లోకి నీరు చేరగా, గురువారం వరద ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా నగర శివారులోని కదిరి రోడ్ లో ఉన్న శిల్పా లేపాక్షి నగర్, సీపీఐ కాలనీలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ఆహార సరఫరా చేయాలని, వరద నష్ట అంచనపై అధికారులను ఆదేశించారు.