విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావును ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ రామలింగారెడ్డి ఆదివారం కలిశారు. ముందుగా డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరామని తెలిపారు. డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.