అనంతపురం జిల్లాలో మాతృ, శిశు మరణాలను తగ్గించాలని డియంహెచ్ఓ డా. దేవి శుక్రవారం సూచించారు. గత రెండు నెలల్లో జరిగిన మాతృ, శిశు మరణాలపై సమీక్ష జరిపారు. వీటిపై స్థానిక డాక్టర్లు పరివేక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. మరణాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేయాలని సూచించారు.