అనంతపురంలో మంగళవారం రాత్రి జరిగిన వృత్తి నిపుణుల సదస్సులో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం. సంకల్ప్ సే సిద్ధి అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సదస్సులో 11 ఏళ్ల ఎన్డీఏ సర్కారు విజయాలను మంత్రి వివరించారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు