అనంతపురం అర్బన్ ఎమ్మెల్లే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకువిశేష స్పందన లభించింది. జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. సుమారు ఈ మెగా జాబ్ మేళాలో 50 ప్రముఖ కంపెనీలతో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్, సీడాప్, డిఆర్డి అధికారులు పాల్గొన్నారు.