అనంతపురం నగరంలోని ఎస్. ఎస్. బి. ఎన్ కళాశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్లే మాట్లాడుతూ. సంపూర్ణ ఆరోగ్యం, మానసికోల్లాసం కోసం యోగా అవసరం అన్నారు. యువత గంజాయి ఇతర డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. వారి దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలన్నారు.