ఉజ్జయిని వాల్మీకి మహర్షి పీఠాధిపతి, రాజ్యసభ ఎంపీ బాలయోగి ఉమేష్ నాథ్ ను అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మినారాయణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వాల్మీకులకు ఎస్టీ హోదా పునరుద్ధరణ గురించి చర్చించారు. ఈ ప్రక్రియలో తమ వంతు సహాయాన్ని కోరగా సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.