అనంతపురం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో తాళ్లకేర గ్రామానికి చెందిన పీ. సరస్వతికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 81, 000/- చెక్కును ఎంపీ అంబికా శుక్రవారం అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్యంలో తలెత్తే అత్యవసర ఖర్చులకు సహాయంగా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్ ఉపయోగపడుతుందన్నారు. నిజంగా ప్రజల కష్టాలను తీరుస్తోందన్నారు. ఈ సహాయం చిరకాలం గుర్తు ఉంచుకుంటానంటూ సరస్వతి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.