కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు అన్యాయం జరిగిందని అనంతపురం నగరంలోని 50వ డివిజన్ ముస్లిం సోదరీమణులు బుధవారం ఆరోపించారు. మాకు ప్రభుత్వ పథకాలతో పాటు పెన్షన్లను తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని. ఇల్లు లేని ముస్లింలకు ఇంటి స్థలాలు కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.