కవియిత్రి ఆతుకూరి మోల్లమాంబ జయంతిని మార్చి 13న నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కుష్బూ కొఠారి బుధవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమె జయంతిని అనంతపురం రెవెన్యూ భవన్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రామాయణం రాసిన తొలి కవియిత్రి మోల్లమాంబ జయంతోత్సవంలో అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరూ పాల్గొనాలని ఆమె కోరారు.