గుడి నిర్మాణానికి ఉంచిన నగదును కొట్టేసిన ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అదనపు ఎస్పీ రమణమూర్తి తెలిపారు. మంగళవారం అనంతపురం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడారు. కణేకల్లు మండలం సొల్లాపురంలో పాములు ఆడిస్తూ జీవిస్తున్న ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. వారి నుంచి రూ. 10. 5 లక్షల నగదు, ఇనుప రాడ్, స్క్రూ డ్రైవర్, 1 బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.