మూడేళ్లుగా వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జిల్లా ఎస్పీ జగదీష్ వివరాలను వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 32. 40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు 90 చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తెలిపారు.