ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ.. వందల కోట్లు లంచాలు తీసుకొని సేకి ద్వారా ఆదాని కంపెనీ ప్రజలపై వేల కోట్ల విద్యుత్ భారాలను వేసిందన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.