అనంతపురం జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైన తిరుమలరెడ్డిను గురువారం అర్చక సమాఖ్య సభ్యులు కలిసారు. ఈ సందర్భంగా అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు వైపీ. ఆంజనేయులు మాట్లాడుతూ. అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏసీకి వివరించామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, పాల్తూరు విజయ్, చంద్రమౌళి, నవీన్ , చేతన్ ఉదయ్, తిరుపతయ్య, మధుసూదనాచార్యులు పాల్గొన్నారు.