జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అనంతపురంలోని మూడవ పట్టణ పోలీసులు రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్ళకూడదన్నారు. డ్రంకెన్ డ్రైవింగ్ చేయరాదన్నారు.