అమరావతిలోని ఏపీ సచివాలయంలో ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ విజయానంద్ ను అనంతపురంకు చెందిన ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవి శంకర్ కలిశారు. అనంతరం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లాలోని పలువురు ఇంజినీర్ అధికారులు పాల్గొన్నారు.