ఓట్లు వేసిన వారిని కూడా మోసం చేసిన ఘనత కూటమి నేతలది నగర మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో మాత్రం భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కార్పొరేటర్లు సైఫుల్లా బేగ్, కమల్ భూషణో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.