అనంతపురం జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ గురువారం నారాయణ జూనియర్ కళాశాల, ఎస్ఆర్ జూనియర్ కళాశాలల హాస్టళ్ లను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థుల బాత్రూంలు, మరుగుదొడ్లు పరిశీలించారు. అక్కడ సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. విద్యార్థులతో కలిసి హాస్టల్ స్థితిగతులపై విచారణ చేపట్టారు.