అనంతపురం నగరంలోని హోసింగ్ బోర్డు నుంచి అశోక్ నగర్ హరిహరదేవాలయం మీదుగా అంబేద్కర్ నగర్ వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంతో ఉండేది. అనేక సంవత్సరాలుగా పలు కారణాలతో రోడ్డు నిర్మాణం పనులు ముందుకు కదలకపోవడంతో స్థానిక నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్ళారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన రహదారి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.