కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు 8వ ఏపీ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. బుధవారం అనంతపురంలో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ కే. నరేంద్ర చౌదరి మాట్లాడారు. ఛాంపియన్ షిప్నకు స్థానిక అశోక్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 6న 8 గంటలకు బాలురు, బాలికల టీమ్లను ఎంపిక చేస్తామని తెలిపారు.