అనంతపురం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మసీదులో మతపెద్దగా ఉన్న మహమ్మద్ ఫయాజ్ (50) అనే వ్యక్తి తన వద్ద ఉండే 13ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలు మార్లు వేధించి ఆమె ఆరునెలల గర్భవతిని చేశాడు. విషయం బయటపడడంతో పోలీసులు పోక్సో కింద అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.