శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల బీఈడీ 4వ సెమిస్టర్ ఫలితాలను పరిపాలన భవనంలో ఉపకులపతి ప్రొఫెసర్ అనిత, రిజిస్ట్రార్ రమేశ్ బాబు శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థులు వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 630 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 588 ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ, పరీక్షలు కంట్రోలర్ డాక్టర్ లోకేశ్ పాల్గొన్నారు.