శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని అనంతపురం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.