తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అనంతపురంలో గురువారం జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నురద్దు చేశారు. తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విషాధ సమయంలో ఈవెంట్ జరపడడం సముచితం కాదు. అందుకే రద్దు చేశాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తెలిపారు.