అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటికి పరిష్కారం చూపుతామని చెప్పారు. గత ఐదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు చక్క దిద్దుతారన్నారు. ప్రజలకు ఈ ప్రభుత్వంపై నమ్మకం, భరోసా ఏర్పడిందని తెలిపారు.