అనంత జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న అపార్టు మెంటుకు లిఫ్టు ఏర్పాటు చేసే క్రమంలో వాచ్మెన్ పైనుంచి కిందికి పడి దుర్మరణం చెందాడు. బెళుగుప్ప మండల కేంద్రానికి చెందిన సురేశ్ లక్ష్మీనగర్ లో నిర్మాణంలో ఉన్న ఆపార్టుమెంటు వద్ద వాచ్మెన్ పనికి కుదిరాడు. లిప్టుకు సంబంధించి పనులు చేస్తుండగా మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి లిప్టు బెడ్డింగ్ పై పడడంతో తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు.