అనంత: రెండు కరోనా కేసులు నమోదు

60చూసినవారు
అనంత: రెండు కరోనా కేసులు నమోదు
అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కానీ తాజాగా సోమవారం అనంతపురం సర్వజన వైద్యశాలలో తొమ్మిది మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిలో పెద్దవడుగూరు మండలానికి చెందిన బాలింత సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతుంది. అలాగే అనంతపురంలోని రాంనగర్ కు చెందిన ఓ మహిళకు ర్యాపిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.

సంబంధిత పోస్ట్