గత నెల 4న ప్రారంభమైన అనంతపురం–బెంగళూరు రైలుకు ప్రయాణికుల స్పందన పెరుగుతోంది. తొలుత పుట్టపర్తి–బెంగళూరు మధ్య నడిచిన ఈ రైలు అనంతపురం వరకు పొడిగించారు. బెంగళూరు నుంచి ఉదయం 8.35కి బయలుదేరి మధ్యాహ్నం 1.55కి అనంతపురం చేరుతుంది. తిరుగు ప్రయాణం 2.10కి ప్రారంభమై రాత్రి 7.50కి బెంగళూరుకు చేరుతుంది. చౌకగానే అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు ఆదరిస్తున్నారు.