అనంతపురం జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం, ప్రిన్సిపాల్ లకు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఇంటర్మీడియట్ విద్యామండలి, కన్వీనర్ వెంకటరమణ నాయక్ మంగళవారం ప్రత్యేక సూచనలు జారీ చేశారు. రాబోయే ప్రయోగ పరీక్షలలో ఎక్కువ మార్కులు వేయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయరాదన్నారు. అలా చేస్తే కళాశాల గుర్తింపును చట్టరీత్యా రద్దు చేస్తామని హెచ్చరించారు.