జ్యోతిబాఫూలే వర్ధంతి సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పుష్ప నివాళులు అర్పించారు. కుల వివక్షతకు గురై, జ్ఞానం ఎవరి సొత్తు కాదు, సమాన అవకాశాలు, హక్కులు కల్పించాలని పోరాడినట్లు గిరిజమ్మ తెలిపారు. జ్యోతిబా ఫూలే అడుగుజాడల్లో తమ వైసీపీ నాయకులు నడుస్తున్నామన్నారు.