అనంతపురం కలెక్టరేట్‌లో 218వ వడ్డే ఓబన్న జయంతిని శనివారం రెవెన్యూ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు బిసి డైరెక్టర్లు వడ్డెర సంఘం అధ్యక్షుడు కుంచపు వడ్డే టిడిపి నాయకులు పోలన్నలు హాజరయ్యి వడ్డే ఓబన్న చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు వడ్డెరలు భారీగా పాల్గొన్నారు.