విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, సహాయ కార్యదర్శి చందు, నగర అధ్యక్షులు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.