అనంతపురంలో ఆదివారం తరగతులు నిర్వహిస్తున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎ. ఐ. ఎస్. ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు హనుమంత రాయుడు మాట్లాడుతూ. పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. డి ఈ వో తక్షణమే స్పందించి చైతన్య నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు.