అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రపంచ మానసిక దినోత్సవంపై అవగాహన కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సైకాలజీ ఆచార్యులు డా. సందీప్ కుమార్ విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ప్రధానంగా వివరించారు. అలాగే విద్యార్థుల జీవితంలో విద్యాపరమైన ఒత్తిడి, వ్యక్తిగత ఒత్తిడులు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు.