రామాయణ రచయిత, తొలి తెలుగు మహిళా కవయిత్రి, కుమ్మర శాలివాహన ఆడపడుచు శ్రీ శ్రీ మొల్ల మాంబ 560వ జయంతిని అధికారకంగా నిర్వహించాలని కోరారు. మంగళవారం అనంతపురం బీసీ సంక్షేమ శాఖ అధికారి ఈ క్రమంలో కుమ్మర శాలివాహన సంఘం నాయకుల వినతిపత్రం అందించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ లో 13వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ అధికారి తెలిపినట్లు వారు వివరించారు.