ఏపీ విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విభజన సాకు చూపి అప్పట్లో ఇచ్చిన హామీలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గురువారం అనంతపురంలో అన్నారు. నేడు సూపర్ సిక్స్ అని చెప్పి అప్పుల పేరుతో హామీలు అమలు చేయడం లేదని, వాస్తవానికి గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రూ. 14 లక్షల కోట్లు అప్పులున్నాయని ప్రచారం చేశారు. తీరా మొన్న బడ్జెట్లో రూ. 6. 50 లక్షలు అప్పు ఉన్నట్లు చూపించారు.