రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 15, 16, 17 వ తేదీలలో అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా గుత్తి మండలం బేతాపల్లిలో పర్యటిస్తుండగా, గ్రామం వద్ద హెలిప్యాడ్, సభా వేదిక, రెన్యూ విండ్ ఎనర్జీ (జెఎఎంబి) ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు.