అనంతపురం పాతూరు 12వ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్‌ను సోమవారం దర్గాలో మాసుమా బీ మరియు సారా బీ దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. దర్గా పరిసరాలలో చేపట్టిన శుభ్రత కార్యక్రమాలు, తదితర సామాజిక సేవలపై ఆయనకు అభినందనలు తెలిపారు. కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్, దర్గా పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఎల్లప్పుడూ సహాయపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.