యోగా పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని అశోక్ నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న జిల్లాస్థాయి యోగా కాంపిటీషన్స్ ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న జిల్లాస్థాయి యోగా కాంపిటీషన్స్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. .