అనంతపురం: వైశ్య విద్యార్థులకు ఉచిత భోజన, వసతి

58చూసినవారు
అనంతపురం: వైశ్య విద్యార్థులకు ఉచిత భోజన, వసతి
అనంతపురంలోని వైశ్య హాస్టల్ లో పేద వైశ్య విద్యార్థులకు ఉచిత భోజన, వసతులు కల్పిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ఉపాధ్యక్షులు తిరువిధుల జగదీష్ బుధవారం విజ్ఞప్తి చేశారు. వేడినీటి సరఫరా, డిజిటల్ లైబ్రరీ, సువిశాల అట స్థలం ఉన్నాయని అన్నారు. పామిడి ఆర్యవైశ్య సంఘం సభ్యులను ఉద్దేశించి పైవిధంగా  కోరారు. ఉద్యోగులకు, శిక్షణ సంస్థల్లో ఉన్నవారికి పేయింగ్ హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్