అనంతపురం: జీఓ నెంబర్ 77ను రద్దు చేయాలి

55చూసినవారు
అనంతపురం: జీఓ నెంబర్ 77ను రద్దు చేయాలి
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం పీ.డీ.ఎస్.యూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఉమేష్ నాయక్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షులు కె. భాస్కర్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 77 రద్దు చేస్తామంటూ నారా లోకేశ్ రెడ్ బుక్ లో రాసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అయిన ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్