అనంతపురం: హజ్‌ 2025 విజయవంతంగా ముగించిన హాజీలు

84చూసినవారు
అనంతపురం: హజ్‌ 2025 విజయవంతంగా ముగించిన హాజీలు
హజ్‌ యాత్ర 2025ను అనంతపురం జిల్లాకు చెందిన 222 మంది హాజీలు విజయవంతంగా పూర్తి చేశారు. హాజీలు జూన్‌ 24వ తేదీ నుంచి దశలవారీగా తిరిగి స్వదేశానికి ప్రయాణించనున్నారు. ఈ సమాచారం‌ను హజ్ కమిటీ వాలంటీర్‌ హాజీ సుహైల్‌ తెలిపారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది ముస్లింలు హజ్‌ యాత్రలో పాల్గొన్నారు. హాజీల సౌకర్యార్థం బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ విమానాశ్రయాల్లో ప్రత్యేక టెర్మినల్స్ ఏర్పాటు చేసినట్లు హాజీ సుహైల్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్